మరో నందమూరి హీరో తెరంగేట్రం
ABN , First Publish Date - 2022-05-29T07:08:13+05:30 IST
నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థని స్థాపించారు...

నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థని స్థాపించారు. ఈ సంస్థ నుంచి ప్రొడక్షన్ నెం.1గా నందమూరి చైతన్య కృష్ణతో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా శనివారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘బసవతారకరామ క్రియేషన్స్ సంస్థ నుంచి మా అబ్బాయిని కథానాయకుడిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఓ కొత్త తరహా కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తామ’’ని జయకృష్ణ తెలిపారు.