సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Another son debut: ఈ దగ్గుబాటి వారసుడు నిలుస్తాడా?

ABN, First Publish Date - 2022-10-07T21:17:54+05:30

రామానాయుడు (Late Ramanaidu's grandson) ఇంకో మనవడు దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) త్వరలోనే సినిమా ఆరంగేట్రం చేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామానాయుడు (Late Ramanaidu's grandson) ఇంకో మనవడు, నిర్మాత సురేష్ బాబు (Daggubati Suresh Babu) రెండో కుమారుడు  దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) త్వరలోనే సినిమా ఆరంగేట్రం చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ (Director Teja) అతన్ని తన సినిమా 'అహింస' (Ahimsa) ద్వారా పరిచయం చేస్తున్నాడు. దర్శకుడు తేజ చాలామంది కొత్తవారిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు, అలాంటి తేజ చేతిలో అభిరామ్ పడ్డాడు అంటే, చాలా మంచిది అనే చెప్పాలి. తేజతో పని చేసినవాళ్ళు నటన విషయంలో నేర్చుకోవడానికి ఎంతో వుంటుంది. ఆ నటి లేక నటుడు ఎంత పెద్ద  కుటుంబం నుండి వచ్చినా, తేజ మాత్రం అతడిని నటుడు/నటి కిందే పరిగణించి తనకి కావలసిన విధంగా నటింప చేస్తాడు. 


అందులో సందేహం లేదు. అయితే అభిరామ్ తన అన్న రాణా (Rana Daggubati), బాబాయి వెంకటేశ్ (Victory Venkatesh)ల లా కాకుండా తన స్వంత  శైలిలోనే వెలితేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు పరిశ్రమలో. ఇందులో అభిరామ్ రెండు కోణాలు కనిపించే పాత్రలో కనిపిస్తాడు అని చెప్తున్నారు. అందరికీ అహింస పాటించండి అని చెప్పే అభిరామ్, హింసా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అని రెండు కోణాల్లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు తేజ. మరి అభిరామ్ ఎంతవరకు తన పాత్రకి న్యాయం చేశాడో సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది. బాబాయి, అన్నయ్య లా చాలాకాలం పరిశ్రమలో నిలుచునటాడా లేదా అన్నది ఈ కినేమతోటే తెలిపోతుంది.  అభిరామ్ తో పాటు గీతిక అనే అమ్మాయి తో పాటు మరో 22 మందిని ఈ సినిమా ద్వారా తేజ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదల అయింది, చాలా ఆసక్తికరంగానే వుంది. మరి సినిమా ఎలా వుండబోతోందో చూడాలి. 

Updated Date - 2022-10-07T21:17:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!