సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఆనందమో ఆవేశమో’ మెలోడీ సాంగ్

ABN, First Publish Date - 2022-11-20T17:48:44+05:30

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ (పవి టీచర్) ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సిందూరం’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ (పవి టీచర్) ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సిందూరం’ (Sindhooram). ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని మొదటి పాట (ఆనందమో ఆవేశమో) లిరికల్ సాంగ్‌ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తాజాగా విడుదల చేశాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్‌కు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా తెరకెక్కిన ఈ పాటను అభయ్ జోద్పూర్కర్ పాడాడు. ఆర్య సినిమాలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’ పాట రాసిన బాలాజీ ఈ పాటకు సాహిత్యం అందించగా.. హరి గౌర సంగీతం అందించారు. 


ఆనందమో ఆవేశమో సాంగ్ లో ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్) బాగా నటించారని, సాంగ్ మెలోడీగా బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి సైతం సాంగ్ గురించి ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడం విశేషం. 


మారేడుమిల్లి ఫారెస్ట్‌లో సింగిల్ షెడ్యూల్‌లో చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి ‘సిందూరం’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసింది. ఈ పాట చూసిన ప్రేక్షకులు ఆహ్లాదకరమైన చిత్రీకరణ, అద్భుతమైన సంగీతం కలగలిపి ఉండడాన్ని చూసి దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి, నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా అభిరుచిని అభినందిస్తున్నారు. ఇప్పటికే సిందూరం టైటిల్‌తో ఒకప్పటి క్లాసిక్ ‘సిందూరం’ సినిమాను గుర్తు చేస్తున్న.. ఈ సినిమా రానున్న రోజుల్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.



Updated Date - 2022-11-20T17:48:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!