సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డైరెక్షన్ వదిలిస్తే.. ఇక అటు వైపే: అనిల్ రావిపూడి (Open Heart with RK Promo)

ABN, First Publish Date - 2022-06-05T00:21:19+05:30

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3’ వంటి వరుస విజయాలతో.. అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 3’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ విజయానందంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3’ వంటి వరుస విజయాలతో.. అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దూసుకుపోతున్నారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 3’ (F3) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ విజయానందంలో ఉన్న అనిల్ రావిపూడి.. త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే(open heart with RK)లో  పాల్గొన్న అనిల్ రావిపూడి.. చేయబోయే సినిమా వివరాలతో పాటు, తన వ్యక్తిగత విషయాలు, కాలేజ్ లైఫ్, దర్శకత్వం వైపు అడుగులు వేయడానికి కారణం, తను ఇప్పటి వరకు చేసిన సినిమాల సక్సెస్‌.. ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. (Open Heart With RK)


ఇందులో..

* సక్సెస్ కిక్కు కంటే భయం ఎక్కువగా పెరిగింది. ఒక సినిమా ఏదైనా తేడా పడితే.. ఇప్పటి వరకు పొగిడిన వారే.. తిడతారేమో అనే భయం ఎక్కువగా పెరిగింది. 

* సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వారంటే.. నాకు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఉన్నారు. ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు. ఆయన సినిమాలు చేసే సమయంలో.. షూటింగ్స్‌లో వాడిన వస్తువులను తీసుకువచ్చి మాకు ఇస్తుండేవారు. (Open Heart With RK) 

* బ్యాక్ బెంచ్‌లో కూర్చుండేవాడిని.. ఎప్పుడైతే ఒక స్కిట్ చేశానో.. కాలేజ్‌లో హీరోగా చూడటం మొదలుపెట్టారు. అప్పుడే అందరూ నన్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి అని పిలిచేవారు.

* నా మొదటి సినిమా ‘పటాస్’. పక్కా మాస్ ఎంటర్‌టైనర్. అయితే ప్రేక్షకులు మాత్రం అందులో కామెడీకి బాగా కనెక్టయ్యారు. ఇక ‘ఎఫ్ 2’తో పూర్తిస్థాయిలో కామెడీ వైపు అడుగులేశాను.

* గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తెలియని ఒక మొరటు కామెడీ ఉంటుంది. ‘ఎట్టా’ అని బాగా వాడుతుంటారు. నా సినిమాలలో కూడా ఆ పదం ఎక్కువగా వినబడుతుంది.

* ఇప్పుడు బాలకృష్ణగారితో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాను. ఆయన బలాన్ని, ఆయన అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా స్ర్కిప్ట్ సిద్ధం చేశా. 

* ప్రశాంతమైన వైవాహిక జీవితం గడపాలంటే ఎవరో ఒకరు తలవూపాలి. మా ఇంట్లో నేను ఊపుతాను. 

* నా కౌమార దశలో.. నగ్మా నన్ను బాగా హాంట్ చేసిన హీరోయిన్. అలా చూస్తూ ఉండిపోయేవాడిని. 

* ఇక చాలు అని ప్రేక్షకులు ఫీలయిన వెంటనే.. దర్శకత్వం పక్కన పెట్టేసి నటుడిగా మారిపోతా. (Open Heart With RK) 


ఇలా అనేక విషయాలను పంచుకున్న అనిల్ రావిపూడి.. ‘ఎఫ్ 3’ చిత్రం విషయంలో తమన్నాతో గొడవలు జరిగాయని వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు తెలియాలంటే.. ఈ ఆదివారం టెలికాస్ట్ కాబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Updated Date - 2022-06-05T00:21:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!