సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Leharaayi: సారీ సాంగ్ వదిలిన అనిల్ రావిపూడి

ABN, First Publish Date - 2022-08-10T22:27:11+05:30

రంజిత్ సొమ్మి (Ranjith Sommi), సౌమ్య మీనన్ (Sowmyaa Menon) హీరోహీరోయిన్లుగా.. ‘ధ‌ర్మపురి’ ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ ముఖ్య తారాగణంగా.. రామకృష్ణ పరమహంస (Ramakrishna Paramahamsa) ద‌ర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంజిత్ సొమ్మి (Ranjith Sommi), సౌమ్య మీనన్ (Sowmyaa Menon) హీరోహీరోయిన్లుగా.. ‘ధ‌ర్మపురి’ ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ ముఖ్య తారాగణంగా.. రామకృష్ణ పరమహంస (Ramakrishna Paramahamsa) ద‌ర్శకత్వంలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ బ్యానర్‌పై మద్దిరెడ్డి శ్రీనివాస్ (Maddyreddy Sreenivas) నిర్మిస్తున్న చిత్రం ‘లెహరాయి’. నిర్మాత బెక్కం వేణుగోపాల్ (Bekkem Venugopal) సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థర్డ్ సింగిల్‌ ‘అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ’ని అనిల్ రావిపూడి  చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను ఘంటాడి కృష్ణ (Gantadi Krishna) స్వరపరచగా.. జస్సీ గిఫ్ట్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. 


పాట విడుదల అనంతరం అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. ‘‘ఘంటాడి కృష్ణగారు స్వరపరిచిన పాటల్ని మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. ఆయన ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారంటే.. కచ్చితంగా మంచి పాటలు ఇచ్చి ఉంటారు. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రామకృష్ణ పరమహంసకు, చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు. పాట విడుదల చేసిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ సినిమాలో 7 పాటలు ఉంటాయని, ప్రతీ సాంగ్ అలరించే విధంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు రామకృష్ణ పరమహంస. మంచి ఫీల్ ఉన్న కథ ఇదని, కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు చార్ట్‌బస్టర్స్‌లో నిలిచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. 



Updated Date - 2022-08-10T22:27:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!