అందగత్తె ఆడిషన్
ABN , First Publish Date - 2022-04-20T06:47:11+05:30 IST
డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కూతురు, హీరోయిన్ శివాని ఈ ఏడాది జరిగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నారు...

డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కూతురు, హీరోయిన్ శివాని ఈ ఏడాది జరిగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘సోమవారం మిస్ ఇండియా ఆడిషన్స్‌కు హాజరయ్యాను. నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇచ్చాను. ఇక నా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ఈ పోటీలో పాల్గొంటున్న తోటి కంటెస్టంట్లకు నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. రాజశేఖర్ హీరోగా, శివాని అతిథి పాత్రలో నటించిన ‘శేఖర్’ త్వరలో విడుదలకానుంది.