సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi: అనసూయ అలిగింది.. అందుకే!

ABN, First Publish Date - 2022-10-04T22:14:39+05:30

అనసూయ అలిగిందట!(Anasuya hurt) బుంగమూతి పెట్టిందట.. ఎవరి మీద ఆమె అలక.. కారణమేంటి? ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మెగాస్టార్‌ చిరంజీవి. (Megastar chiranjeevi) అనసూయ అలక కూడా ఆయన మీదేనట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనసూయ అలిగిందట!(Anasuya hurt)

బుంగమూతి పెట్టిందట..

ఎవరి మీద ఆమె అలక.. కారణమేంటి? 

ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మెగాస్టార్‌ చిరంజీవి. (Megastar chiranjeevi)

అనసూయ అలక కూడా ఆయన మీదేనట. 

మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు. ఇంతకీ అనసుయ అలకకు కారణమేంటో చూద్దాం. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’(God Father) చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల అనంతపురంలో చిరంజీవి ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఆ రోజు ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో ప్రీ రిలీజ్‌ సింపుల్‌గా చిరంజీవి స్పీచ్‌తో ముగించేశారు. అంతటి వర్షంలో కూడా చిరంజీవి స్పీచ్‌ కోసం ఆడియన్స్‌ వర్షంలో తడుస్తూనే ఉన్నారు. వర్షం కారణంగా కంగారు వేడుక పూర్తి చేయడం కోసం చిరంజీవి వేదికపై కొందరు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. చిరంజీవి మరచిపోయిన వారిలో అనసూయ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆమె కూడా ఓ పాత్ర పోషించారు. అయితే ఇటీవల చిరంజీవిని కలిసిన సందర్భంలో ‘సార్‌ అనంతపురం వేడుకలో నా గురించి చెప్పడం మరచిపోయారు’ అని చిరంజీవిని అడిగేసిందట అనసూయ. ఆ విషయాన్ని మంగళవారం జరిగిన వేడుకలో ఆ కారణంగా అనసూయ నాపై అలిగిందట’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అందరికి ఫోన్ చేసి సారీ చెప్పా అని అన్నారు. 


అదే వేదికపై చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడారు. సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు  రీమేక్‌గా మోహన్‌రాజా తెరకెక్కించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకులు ముందుకొస్తుంది. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. 


Updated Date - 2022-10-04T22:14:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!