సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anasuya Bharadwaj: అందుకే ‘గాడ్‌ఫాదర్‌’కి దూరం

ABN, First Publish Date - 2022-10-06T21:59:59+05:30

యాంకర్‌, నటి అనసూయపై (Anasuya)నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నెట్టింట ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురై, మాటల యుద్ధాలతో కనిపించే అనసూయపై ప్రశంసలు (Netizens happy about Anasuya)అనగానే ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంకర్‌, నటి అనసూయపై (Anasuya)నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నెట్టింట ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురై, మాటల యుద్ధాలతో కనిపించే అనసూయపై ప్రశంసలు (Netizens happy about Anasuya)అనగానే ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఇటీవల విడుదలై ‘గాడ్‌ ఫాదర్‌’ (God father)చిత్రంలో న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌గా కనిపించారామె. నిడివి తక్కువే అయినా ఆ కొన్ని క్షణాల పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అనసూయ యాక్టింగ్‌ని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’లో మీ రోల్‌ చాలా నచ్చింది. సినిమాలో ఇంత మంచి రోల్‌ చేసినప్పటికీ మీరెందుకు ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం లేదు’’ అని ట్వీట్‌ చేశాడు. నెటిజన్‌ ప్రశ్నకు అనసూయ స్పందించారు. ‘‘నేను చెప్పేది మీరు నమ్మాలి. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఎంతో కష్టపడుతున్నా. చాలా షూటింగ్స్‌ ఒకేసారి జరుగుతున్నాయి. దాంతో చాలా బిజీగా ఉన్నాను’’ అని అనసూయ సమాఽధానమిచ్చారు. అనసూయ వరుస షూటింగ్‌లతో బిజీగా కావడం వల్ల ప్రచారాల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. 


ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ‘అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో అనసూయ గురించి ప్రస్తావించలేదని దాంతో తనపై అనసూయ అలిగిందని చిరంజీవి చమత్కరించిన సంగతి తెలిసిందే! మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే! మాతృకతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచి, మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మోహన్‌రాజా పలు మార్పులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 




Updated Date - 2022-10-06T21:59:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!