ప్లీజ్.. నన్ను అలా పిలవొద్దు: అనసూయ
ABN , First Publish Date - 2022-01-18T19:27:41+05:30 IST
టీవీ యాంకర్‌గానే కాకుండా ‘క్షణం’, ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతో నటిగా మరో మెట్టు ఎక్కారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం నటిగా ఆమె మరింత బిజీ అయ్యారు. తాజాగా ‘పుష్ప’లోనూ కీలక పాత్ర పోషించారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయకు ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. సమస్యలపై పోరాడటానికి ఆమె ఎప్పుడు ముందుంటుంది. తన డ్రెసింగ్‌పై నెటిజన్లు చేసే కామెంట్లకు ధీటుగా సెటైర్లు వేస్తూట్రోల్ అయిన సందర్భాలెన్నో.

అది ఏజ్ షేమింగ్ అవుతుంది..
మీ పెంపకంపై అనుమానం వస్తుంది..
ఎలా ఉండాలో నాకు తెలుసు
– నెటిజన్లపై మండిపడ్డ అనసూయ
టీవీ యాంకర్‌గానే కాకుండా ‘క్షణం’, ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతో నటిగా మరో మెట్టు ఎక్కారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం నటిగా ఆమె మరింత బిజీ అయ్యారు. తాజాగా ‘పుష్ప’లోనూ కీలక పాత్ర పోషించారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయకు ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. సమస్యలపై పోరాడటానికి ఆమె ఎప్పుడు ముందుంటుంది. తన డ్రెసింగ్‌పై నెటిజన్లు చేసే కామెంట్లకు ధీటుగా సెటైర్లు వేస్తూట్రోల్ అయిన సందర్భాలెన్నో. అయినా అవేమీ అనసూయ పట్టించుకోరు. సంక్రాంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంతగా తెలీదు కదా! నీ ప్రశ్న ఏజ్ షేమింగ్ కింద అనిపిస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని ధీటైన జవాబు ఇచ్చింది.
అయితే అను.. ఇచ్చిన జవాబు చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీనికి మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు. ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఎవరి ఇష్టం వారిది. ఒక పడవ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే నీట మునిగిపోతుంది. జన సముద్రంతో ఎలా ఉండాలో, ఏది ఎంత తీసుకోవాలో నాకు బాగా తెలుసు’ అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. గతంలోలాగా ట్రోలింగ్ గురించి, నేను, నా ఫ్యామిలీ అసలు పట్టించుకోవడం లేదు. మేమంతా ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాం. ఒకరు మరొకరిని బాధ పెడితే చివరికి వారు కూడా ఆ బాధను అనుభవిస్తారు. కర్మ అనేది ఒకటి ఉంటుందని" అని అనసూయ కాస్త ఘాటుగానే స్పందించారు.

