హీరోయిన్ Ananya Nagalla అకౌంట్‌లో కూడా ఓ యాడ్!

ABN , First Publish Date - 2022-07-08T21:31:12+05:30 IST

స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఈ మధ్య కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ రెండు వైపులా సంపాదిస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, పూజా హెగ్డే, రష్మిక వంటి వారెందరో కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ

హీరోయిన్ Ananya Nagalla అకౌంట్‌లో కూడా ఓ యాడ్!

స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఈ మధ్య కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ రెండు వైపులా సంపాదిస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, పూజా హెగ్డే, రష్మిక వంటి వారెందరో కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి ఓ చిన్న నటి కూడా చేరింది. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా?. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) చిత్రంలో నటించిన అనన్య నాగళ్ల (Ananya Nagalla). నాన్-శస్త్రచికిత్స పద్ధతులతో.. వినూత్న చికిత్సను కలిగి ఉన్న సిటీ వాస్క్యులర్ ఆసుపత్రికి అనన్య నాగళ్ల వచ్చే ఏడాది నుండి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నట్లుగా.. ఆ హాస్పిటల్‌ డైరెక్టర్, చీఫ్ వాస్కులర్ ఫిజిషియన్ మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ శైలేష్ కుమార్ గార్గే అధికారికంగా ప్రకటించారు.


ఈ హాస్పిటల్స్‌కి సంబంధించిన యాడ్ షూట్ కూడా ప్రారంభమైనట్లుగా వారు తెలిపారు. ఈ యాడ్‌కు.. కీర్తి సురేష్‌ ‘మిస్ ఇండియా’ చిత్ర దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. గోల్డెన్ డైమండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. సిటీ వాస్కులర్ హాస్పిటల్ విషయానికి వస్తే.. డే కేర్ సర్జరీలు మరియు వెరికోస్ వెయిన్స్ ట్రీట్‌మెంట్, యుటెరైన్ ఫైబ్రాయిడ్ ట్రీట్‌మెంట్ మరియు అటువంటి అనేక ఇతర సమస్యల వంటి సర్జికల్ లేజర్ చికిత్సలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ లాటరీ పద్ధతిలో రోగులకు ఉచితంగా చికిత్స చేయడంలో డాక్టర్  శైలేష్ పేరుగాంచారు. కాగా, అనన్య నాగళ్ల నటించిన వాణిజ్య ప్రకటన జూలై ఎండింగ్ నుండి ప్రసారం కానుందని తెలుస్తోంది.

Updated Date - 2022-07-08T21:31:12+05:30 IST

Read more