అడవిలో వింత జీవుల మధ్య

ABN , First Publish Date - 2022-08-23T05:50:47+05:30 IST

కోలీవుడ్‌ స్టార్‌ ఆర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కెప్టెన్‌’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రన్‌, హరీశ్‌ ఉత్తమన్‌ ప్రధాన పాత్రలు పోషించారు...

అడవిలో వింత జీవుల మధ్య

కోలీవుడ్‌ స్టార్‌ ఆర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కెప్టెన్‌’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రన్‌, హరీశ్‌ ఉత్తమన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 8న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సోమవారం నితిన్‌ ‘కెప్టెన్‌’ ట్రైలర్‌ ఆవిష్కరించారు. ‘‘ఆర్య - సౌందర్‌ రాజన్‌ కాంబినేషన్‌లో రూపొందించిన రెండో చిత్రమిది. అటవీ నేపథ్యంలో సాగుతుంది. అడవిలో వింత జీవులు సంచరిస్తుంటాయి. వాటిని హీరో, అతని టీమ్‌ ఎలా ఎదుర్కొంది? అనేదే చిత్రకథ. యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయ’’ని చిత్రబృందం తెలిపింది. మాళవికా అవినాశ్‌, గోకుల్‌ ఆనంద్‌, భరత్‌ రాజ్‌, ఆదిత్యా మీనన్‌ తదితరులు నటించారు. సంగీతం: డి.ఇమాన్‌. 


Updated Date - 2022-08-23T05:50:47+05:30 IST

Read more