సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Agent : ఓటీటీ పార్టనర్ ఎవరంటే.. !

ABN, First Publish Date - 2022-05-24T13:59:21+05:30

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (MOst Eligible Bachelor) చిత్రంతో తన కెరీర్‌లోనే తొలి హిట్ అందుకున్నాడు. తదుపరిగా ‘ఏజెంట్’ (Agent) అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. సురేంద్రరెడ్డి (Surenderreddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (MOst Eligible Bachelor) చిత్రంతో తన కెరీర్‌లోనే తొలి హిట్ అందుకున్నాడు. తదుపరిగా ‘ఏజెంట్’ (Agent) అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. సురేంద్రరెడ్డి (Surenderreddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. వక్కంతం వంశీ (Vakkantham Vamshy) కథ అందిస్తున్న ఈ సినిమాకి హిపాప్ తమిళ సంగీతం అందిస్తుండగా.. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్ గా నటిస్తున్నారు.  ఆగస్ట్ 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హాలీవుడ్ సూపర్ హిట్ బోర్న్ (Bourne) సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ మేకోవర్, సిక్స్‌ప్యాక్ బాడీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ పార్టనర్‌గా అమెజాన్ ప్రైమ్ (Aamazon Prime) సంస్థ వ్యవహరిస్తుండడం విశేషం.


‘ఏజెంట్’ (Agent) చిత్రం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ (Post theatrical degital streaming rights) ను అమెజాన్ ప్రైమ్ (Aamazon Prime) వారికి భారీ డీల్ కు విక్రయించినట్టు సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వారు సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవువుతోంది. అలాగే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రం డిజిటల్ రైట్స్‌ను కూడా అమెజాన్ వారే కొనుగోలు చేశారు. 


అఖిల్ (Akhil) కెరీర్‌లో ఐదవ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ‘ఏజెంట్’ (Agent) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశ రహస్యాలకు సంబంధించిన సీక్రెట్ మిషన్ ను టేకప్ చేసిన ఇండియన్ ‘ఏజెంట్’ కు,  భారతదేశానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు దేశం కోసం ఆ ఏజెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ మేజర్‌ని అతడు ఎలా ఢీకొట్టాడు అన్నదే మిగతా కథ. హాలీవుడ్  టెక్నీషియన్స్ తో చిత్రీకరించిన అఖిల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అఖిల్ అక్కినేని ఏ స్థాయి సక్సె్స్ అందుకుంటాడో చూడాలి. 

Updated Date - 2022-05-24T13:59:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!