సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kantara: ఓటీటీలో ‘వరాహరూపం’ సాంగ్ కొత్త వెర్షన్.. వ్యూవర్స్ రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2022-11-24T18:27:57+05:30

చిన్న సినిమాగా విడుదల పెద్ద సక్సెస్ సాధించిన చిత్రం ‘కాంతారా’..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న సినిమాగా విడుదల పెద్ద సక్సెస్ సాధించిన చిత్రం ‘కాంతారా’  (Kantara). ‘కేజీయఫ్’ నిర్మాతు హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ కన్నడ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూ.400 కోట్లకి పైగా వసూళ్లని సాధించింది. ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న పాట ‘వరాహరూపం’. ఆ పాటకి థియేటర్స్‌ హోరెత్తిపోయాయి. అయితే ఆ సాంగ్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.


కేరళకు చెందిన బ్యాండ్ ‘తైక్కుడం బ్రిడ్జ్’ (Thaikkudam Bridge).. తమ పాట ‘నవరసం’ని కాంతారాలో ‘వరాహరూపం’గా కాపీ కొట్టారని కాపీ రైట్స్ కేసు వేసింది. దీంతో సినిమాకే ప్రాణమైన ఆ సాంగ్‌పై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందోనని ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. ఈ తరుణంలో ఆ పాటని వాడొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ పాటని తొలగించి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లో నవంబర్ 24న ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఆ పాటకి బదులు మరో వెర్షన్ పాటని ఆ సినిమాలో భాగం చేశారు. అయితే ఈ కొత్త వెర్షన్ ఇంతకు ముందున్న పాటలాగే ఫీల్ కలిగించట్లేదని నెటిజన్లు అంటున్నారు. దాన్ని వల్ల సినిమాలో ఆత్మ మిస్ అవుతోందని బాధపడుతున్నారు. ఆ సాంగ్‌నే ఉంచేలా మూవీ టీం ఒప్పందం కుదుర్చుకుంటే బావుండేదని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.


ఈ విషయాన్ని తెలుపుతూ తైక్కుడం బ్రిడ్జ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ‘అమెజాన్ ప్రైమ్ మా పాట నవరసం (NAVARASAM) కాపీ వెర్షన్‌ను ‘కాంతారా’ చిత్రం నుంచి తొలగించింది. న్యాయమే గెలుస్తుంది. మా న్యాయవాది: సతీష్ మూర్తి, మా మెంటర్ మాతృభూమి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. మా హక్కుల కోసం పోరాడేందుకు తమ హృదయపూర్వక మద్దతును అందించిన మా సంగీత విద్వాంసుడు, అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. కాగా ఈ సినిమాతో కన్నడ నటుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.



Updated Date - 2022-11-24T18:27:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!