‘అల్లూరి’ గురి కుదిరింది
ABN , First Publish Date - 2022-08-14T06:16:08+05:30 IST
శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ..
శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. కయ్యదు లోహర్ కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదో ఫిక్షనల్ బయోపిక్. శ్రీవిష్ణు నిజాయతీ గల పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. సెప్టెంబరు రెండో వారంలో దసరా సెలవులు మొదలవుతాయి. ఆ సీజన్ సినిమాలకు బాగా కలిసొస్తుంది. అందుకే ‘అల్లూరి’ని విడుదల చేస్తున్నాం. హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన బాణీలు ఆకట్టుకొంటాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామ’’న్నారు. తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.