జాన్ అబ్రహం‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అల్లు శిరీష్

ABN , First Publish Date - 2022-04-03T17:57:36+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్‌లో తెలుగు సినిమాలపై నోరు పారేసుకొని.. తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నటనకి భాషతో సంబంధం లేదు. నటుడికి ఇతర భాషల పట్ల వివక్ష పనికిరాదు. ఈ విషయం జాన్ అబ్రహంకు తెలుసో లేదో తెలియదు కానీ.. తాను తెలుగు సినిమాల్లో ససేమీరా నటించనని.. బాలీవుడ్ హీరోని కాబట్టి హిందీ సినిమాల్లోనే నటిస్తానని, డబ్బు కోసం ఇతర భాషల్లో నటించనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో జాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇటీవల విడుదలైన జాన్ అబ్రహం ‘అటాక్ పార్ట్ 1’ చిత్రానికి హైదరాబాద్ లో అంతగా స్పందన లేదని తెలుస్తోంది.

జాన్ అబ్రహం‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అల్లు శిరీష్

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్‌లో తెలుగు సినిమాలపై నోరు పారేసుకొని.. తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నటనకి భాషతో సంబంధం లేదు.  నటుడికి ఇతర భాషల పట్ల వివక్ష పనికిరాదు.  ఈ విషయం జాన్ అబ్రహంకు తెలుసో లేదో తెలియదు కానీ..  తాను తెలుగు సినిమాల్లో ససేమీరా నటించనని..  బాలీవుడ్ హీరోని కాబట్టి హిందీ సినిమాల్లోనే నటిస్తానని, డబ్బు కోసం ఇతర భాషల్లో నటించనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో జాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇటీవల విడుదలైన జాన్ అబ్రహం ‘అటాక్ పార్ట్ 1’ చిత్రానికి హైదరాబాద్ లో అంతగా స్పందన లేదని తెలుస్తోంది. తొలి రోజు ఈ సినిమా కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం, అదే రోజు ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఏకంగా అక్కడ రూ. 13 కోట్లు కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే జాన్ అబ్రహం వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో అల్లు శిరీశ్ దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు.  


‘బాలీవుడ్ లో టాప్ హీరోగా ఉండే కంటే..  టాలీవుడ్ లో అట్టడుగు హీరోగా ఉండేందుకే తాను ప్రాధాన్యం ఇస్తాను’ అంటూ శిరీశ్  చెప్పాడు. సరిగ్గా అటాక్ సినిమా విడుదలైన ఆ మర్నాడే శిరీశ్ ఈ రకంగా వ్యాఖ్యానించడంతో .. జాన్ అబ్రహంకు ఇది దిమ్మతిరిగే కౌంటరని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  బాలీవుడ్ హీరోలు తెలుగులో నటించడానికి ఇష్టపడుతున్న ఈ తరుణంలో జాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం..  గమనార్హం. బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యాన్ని సహించని కారణంగానే జాన్ తెలుగు సినిమా పట్ల తన ఉక్రోషాన్ని బైటపెట్టుకున్నాడని చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2022-04-03T17:57:36+05:30 IST

Read more