Allu Aravind: ఈసారి అల్లు అవార్డు ఎవరికో?

ABN , First Publish Date - 2022-09-24T22:59:48+05:30 IST

ప్రతి ఏటా దివంగత అల్లు రామలింగయ్య (Allu Ramalingiah) గారి పేరు మీద అతని కుమారుడు, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఒక అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Allu Aravind: ఈసారి అల్లు అవార్డు ఎవరికో?

ప్రతి ఏటా దివంగత అల్లు రామలింగయ్య (Allu Ramalingiah) గారి పేరు మీద అతని కుమారుడు, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఒక అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది అతని అవార్డుకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అదేమిటంటే ఈ సంవత్సరం అక్టోబర్ 1, అల్లు రామలింగయ్య 100వ జన్మదిన కావటం (Centenary celebrations) ఒక విశేషం. ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఈ అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారో అని చిత్ర పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. ఈ అవార్డు ఫంక్షన్ కి అల్లు కుటుంబ సభ్యులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అలాగే మరికొంత మంది మెగా నటులు హాజరు అయ్యే అవకాశం వుంది. 


అలాగే ఈ అక్టోబర్ 1న అల్లు ఎంటర్ టైన్ మెంట్ స్టూడియో (All Entertainment Studios) కూడా ప్రారంభోత్సవం జరిగే అవకాశం కూడా వుంది. ఈ స్టూడియో లో అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు మిగతా బ్రదర్స్ కూడా పార్దనర్స్ గా వున్నారు.  బహుశా అల్లు రామలింగయ్య అవార్డు ఫంక్షన్ కూడా అక్కడే పెట్టె సూచనలు కూడా కనపడుతున్నాయి. లేదా అవార్డు ఫంక్షన్ హైదరాబాద్ లో ఏదైనా హోటల్లో పెట్టె అవకాశాలు కూడా వున్నాయి. అవార్డు ఎవరు తీసుకున్నా ఈసారి మాత్రం ప్రత్యేకం కాబట్టి ఎవరికి వస్తోందో అని పరిశ్రమలో ఆసక్తిగా చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈసారి ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నా ఒక క్యారెక్టర్ యాక్టర్ కి వచ్చే అవకాశం వుంది అంటున్నారు. 

Updated Date - 2022-09-24T22:59:48+05:30 IST