Allu Arjun: ‘పుష్ప: ది రైజ్’ రష్యన్ ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2022-11-29T22:38:19+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise). లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు.

Allu Arjun: ‘పుష్ప: ది రైజ్’ రష్యన్ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise). లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్‌లో అయితే ఏకంగా 120కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘పుష్ప’ విడుదలై ఏడాది కావస్తున్నా అంతర్జాతీయంగా ఈ చిత్రం గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘పుష్ప’ ను రష్యాలో విడుదల చేయనున్నారు. 


‘పుష్ప’ రష్యాలో డిసెంబర్ 8న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా రష్యన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్‌లో బన్నీ మేనరిజమ్స్ ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కూడా మెస్మరైజ్ చేసింది. రష్యన్ అభిమానులను ఆకట్టుకునేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిత్ర బృందం డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మీడియాతో ముచ్చటించనుంది. కొన్ని రోజుల చిత్రం పుష్ప చిత్రాన్ని మాస్కో ఫిలిం ఫిస్టివల్‌లో ప్రదర్శించారు. బ్లాక్‌బస్టర్స్ కేటగీరీ కింద ఈ చిత్రాన్ని స్క్రీన్ చేశారు. ఆ సమయంలో రష్యన్ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందువల్ల మరింత మంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయాలని నిర్మాతలు .. రష్యన్ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), సునీల్, ధనుంజయ, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో విడుదలైంది. అక్కడ భారీ స్థాయి వసూళ్లను రాబడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. అయితే, రష్యాలో విడుదల కానున్న ‘పుష్ప’ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 



Updated Date - 2022-11-29T22:38:19+05:30 IST