సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: ఐకాన్ స్టార్ సింప్లిసిటీ చూశారా?

ABN, First Publish Date - 2022-09-29T23:02:48+05:30

‘పుష్స’ (Pushpa) సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ఎంత సింపుల్‌గా ఉంటారో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పుష్స’ (Pushpa) సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ఎంత సింపుల్‌గా ఉంటారో.. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలు తెలియజేస్తున్నాయి. మొదటి సినిమా ‘గంగోత్రి’ (Gangotri) నుంచి.. సినిమా సినిమాకూ వైవిధ్యతను చాటుకుంటూ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. అయితే.. అటు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఇటు ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడనేది.. అప్పుడప్పుడు ఆయన పోస్ట్ చేసే వీడియోలను చూస్తుంటే తెలుస్తుంది. తన పిల్లలతో సరదాగా గడిపే వీడియోలను, ఫొటోలను బన్నీ షేర్ చేయడం, అవి వైరల్ అవడం కామనే. తాజాగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ (Golden Temple at Amritsar)ను సందర్శించారు. తన సతీమణి అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ (Happy Birthday Cutie) అంటూ ఓ వీడియోను, పిక్‌ను పోస్ట్ చేసి.. తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


అయితే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఫొటోలలో అల్లు అర్జున్‌ని చూసిన వారంతా.. ఆయన సింప్లిసిటీకి ఆశ్చర్యపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా.. ఒక సాధారణ వ్యక్తిలా ఆ టెంపుల్‌ను సందర్శించడం అల్లు అర్జున్‌లోని సింప్లిసిటీ‌కి నిదర్శనం.. అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ చేసే పోస్ట్‌లతో అల్లు అర్జున్ పేరు ట్రెండ్ అవుతోంది. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ‘పుష్ప పార్ట్ 1’ (Pushpa)తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ‘పార్ట్ 2’పై భారీగా అంచనాలను పెంచేసిన బన్నీ.. త్వరలోనే ఈ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ని స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత.. టాలీవుడ్‌లోని ఇద్దరు అగ్ర దర్శకులతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.









Updated Date - 2022-09-29T23:02:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!