సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: 5 యాడ్స్, 45 కోట్లు దట్ ఈజ్ బన్నీ! (Bunny)

ABN, First Publish Date - 2022-09-21T16:55:56+05:30

అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ఇప్పుడు ప్రపంచం అంత మారుమోగుతోంది. పుష్ప (Pushpa) అనే సినిమా అతన్ని అంతలా తీసుకువెళ్ళింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ఇప్పుడు ప్రపంచం అంత మారుమోగుతోంది. పుష్ప (Pushpa) అనే సినిమా అతన్ని అంతలా తీసుకువెళ్ళింది. అతని చుట్టూ ఇప్పుడు  కోట్ల వ్యాపారం నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు దేశం లో ఏ నటుడికీ లేనంత డిమాండ్ అల్లు అర్జున్ (Allu Arjun)కి వుంది. అది ఎదో వూరికే వచ్చింది కాదు, పుష్ప సినిమాలో అతను ఎంత కష్ట పడ్డాడో చూస్తే తెలుస్తుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. అల్లు అర్జున్ లేదా బన్నీ (Bunny) అని ముద్దుగా పిలుచుకునే అతని అభిమానులు, ఇప్పుడు చాల బ్రాండ్స్ (Brand)కి అంబాసడర్ (Brand Ambassador) గా వున్నాడు. అతను  నచ్చిన వాటికే ఒకే చెప్తూ, ఆ యాడ్స్ షూట్ చేసే పనిలో వున్నాడు. ఇప్పుడు బన్నీ ఒక 5 (Five) యాడ్స్ (Advertisements) ఒప్పుకున్నాడు అని తెలిసింది. వాటికీ అతను తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా 45 కోట్లు (45 Crores). ఒక్కో యాడ్ కి 9 కోట్లు (Nine Crores) వంతున తీసుకుంటున్నాడు. ఇలా ఇంత డిమాండ్ వున్న నటుడు బహుశా ఎవరూ లేరేమో. హిందీ (Bollywood) నటులకు మించి తలదన్నేలా, బన్నీ పేరు ఇప్పుడు వినపడుతోంది. అందుకే పుష్ప పార్ట్ 2 (Pushpa Part 2)కి తొందర పడకుండా, ఎక్కడా రాజీ పడకుండా తీయాలని అనుకుంటున్నాడు. దర్శకుడు సుకుమార్ తో బన్నీ ఇప్పుడు ఆ షూటింగ్ గురించే మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. త్వరలో షూటింగ్ మొదలవుతుంది. ఈలోపు వూరికే  కూర్చోకుండా,తన బ్రాండ్ ని విస్తృతపరచడానికి ఈ యాడ్స్ చేసుకుంటూ పోతున్నాడు. దట్ ఈజ్ బన్నీ!

Updated Date - 2022-09-21T16:55:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!