గ్రాండ్‌ మార్షల్‌అల్లు అర్జున్‌!

ABN , First Publish Date - 2022-08-23T05:49:38+05:30 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పేరెడ్‌ న్యూయార్క్‌ 2022’ కు ఈ ఏడాది గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో భారతదేశం నుంచి అల్లు అర్జున్‌ ప్రాతినిధ్యం...

గ్రాండ్‌ మార్షల్‌అల్లు అర్జున్‌!

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పేరెడ్‌ న్యూయార్క్‌ 2022’ కు ఈ ఏడాది గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో భారతదేశం నుంచి అల్లు అర్జున్‌  ప్రాతినిధ్యం వహించారు. సతీమణి స్నేహతో కలసి ఈ ఈవెంట్‌కు  ఆయన హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రవాసులు హాజరై భారతదేశం పట్ల ఉన్న దేశభక్తిని, అల్లు అర్జున్‌ అంటే ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 5 లక్షల మంది ఈ  పెరేడ్‌కు రావడం  ఒక రికార్డ్‌గా పేర్కొంటున్నారు. భారతీయులతో పాటుగా మువ్వన్నెల జెండాను రెపరెప లాడిస్తూ న్యూయార్క్‌ వీధుల్లో తిరిగారు అల్లు అర్జున్‌. ఆయనను చూడడానికి  భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు ‘తగ్గేదేలా.. జైహింద్‌’ అని ఉన్న ప్లకార్డులు ఆయనకు చూపించారు. అందరినీ ప్రేమతో పలకరిస్తూ అభిమానులతో ముచ్చటించారు అల్లు అర్జున్‌. అనంతరం న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ అల్లు అర్జున్‌ను సన్మానించారు. భేటి తర్వాత ఇద్దరూ కలసి ‘తగ్గేదే లా’ సిగ్నేచర్‌ మూమెంట్‌ చేశారు. 


Updated Date - 2022-08-23T05:49:38+05:30 IST

Read more