బెల్‌గ్రేడ్‌, సెర్బియాలో గ్రాండ్‌గా బన్నీ పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-04-08T22:01:32+05:30 IST

ఈ రోజు (ఏప్రిల్ 8 ) అల్లు అర్జున్ 40వ పుట్టినరోజు. ప్రతీ ఏడాది బన్నీ బర్త్ డే వేడుకల్ని అభిమానులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. తన పుట్టినరోజు నాడు అభిమానులకి ప్రత్యేకంగా అభివాదం చేయడాన్ని అతడు ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అల్లు అర్జున్ కు తన పుట్టిన రోజు నాడు అభిమానులతో ఇంటరాక్ట్ అవడం కుదరడంలేదు. ఎందుకంటే ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకల్ని తన ఫ్యామిలీతో కలిసి యూరప్ కంట్రీస్ లో ప్లాన్ చేశాడు. బెల్ గ్రేడ్, సెర్బియాలో తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు 50 మంది స్నేహితుల సమక్షంలో బన్నీ తన పుట్టిన రోజు వేడుకల్ని చాలా గ్రాండ్ గా జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

ఇక అల్లు అర్జున్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఇన్టాస్టా ఖాతా ద్వారా అభిమానుల్ని ఉద్దేశిస్తూ హృదయ పూర్వకమైన పోస్ట్ పెట్టాడు. తనని ఇంతటి వారిని చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలియచేశాడు. అలాగే.. తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు , స్నేహితులకు, గురువులకు ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-04-08T22:01:32+05:30 IST

Read more