Allu Arjun: ఓడిపోయారు!

ABN , First Publish Date - 2022-09-20T21:49:28+05:30 IST

ఐకాన్‌స్టార్‌ (Icon star)అల్లు అర్జున్‌(Allu arjun)కు తీరిక దొరికితే తన చిన్నారులు అయాన్‌, అర్హ(Arha)తో గడుపుతుంటారు. ఇద్దరు బిడ్డలతో కలిసి ఆయన చేసే అల్లరికి అంతే ఉండదు.

Allu Arjun: ఓడిపోయారు!

ఐకాన్‌స్టార్‌ (Icon star)అల్లు అర్జున్‌(Allu arjun)కు తీరిక దొరికితే తన చిన్నారులు అయాన్‌, అర్హ(Arha)తో గడుపుతుంటారు. ఇద్దరు బిడ్డలతో కలిసి ఆయన చేసే అల్లరికి అంతే ఉండదు. అయితే ఎక్కువగా తన గారాలపట్టీ అర్హతోనే ఆడుతుంటారు బన్నీ (Bunny). అర్హ తన తండ్రికి రకరకాల టాస్క్‌లు ఇస్తుంటుంది. అందులో గెలవాలని కండీషన్‌ పెడుతుంది. ఆ వీడియోల్లో అర్హ ముద్దుముద్దు మాటలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్‌ తన కూతురితో కలిసి ఓ ఫన్నీ గేమ్‌ (Allu arjun funny game) ఆడారు. అర్హ వేసిన మొదటి ప్రశ్నకు సమాధానం కరెక్ట్‌గానే చెప్పినా.. టంగ్‌ ట్విస్టర్‌ గేమ్‌లో బన్నీ ఓడిపోయారు. తాజాగా ఈ వీడియో నెట్టంట వైరల్‌ అవుతోంది. 


ఆ వీడియోలో ఏముందంటే... మొదట అర్హ తాను చెప్పిన మాటలను తప్పు లేకుండా చెప్పాలంటూ తండ్రికి ఓ ఛాలెంజ్‌ విసిరింది. ‘గంగిగోవు పాటలు గరిటెడైనా చాలు’ అని పొడుపు కథ విసరగా.. దానికి జున్ను అని సమాధానం చెప్పారు బన్నీ. తర్వాత ఏడు నల్ల లారీలు, ఏడు తెల్ల లారీలు అని ఫాస్ట్‌గా చెప్పు అనగానే బన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఫాస్ట్‌గా చెప్పే క్రమంలో తప్పు పలికారు. దాంతో అర్హ చెప్పలేకపోయావ్‌ అంటూ  క్యూట్‌గా నవ్వింది. ఆ వీడియో క్లిప్‌ను అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టాటస్‌లో పోస్ట్‌ చేశారు. అభిమానులు ఆ వీడియో చూసి మురిసిపోతున్నారు. 


బన్నీ కూతురు అర్హ కూడా వెండితెరపై మెరవనుంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో బాలనటిగా అర్హ నటిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప –2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తదుపరి చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తారని తెలిసింది. 




Updated Date - 2022-09-20T21:49:28+05:30 IST