అనసూయ సినిమాకి అల్లు అరవింద్ సపోర్ట్

ABN , First Publish Date - 2022-04-08T02:39:06+05:30 IST

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి

అనసూయ సినిమాకి అల్లు అరవింద్ సపోర్ట్

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్రంలోని రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ ‘దర్జా’ చిత్రంలోని రెండో పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. ఈ పాట చూస్తుంటే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.


కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటీవల టీజర్‌ని నిర్మాత సురేష్ బాబుగారు, ఫస్ట్ సింగిల్‌ని దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే ‘దర్జా’ విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.Updated Date - 2022-04-08T02:39:06+05:30 IST

Read more