సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Aravind: రాఘవేంద్రరావు బి.ఏ అంటే తెలుసా?

ABN, First Publish Date - 2022-12-02T00:21:05+05:30

‘‘న్యూటన్‌ ఆపిల్‌ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలోకనిపెట్టాను’’ అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోకి అల్లు అరవింద్‌, సురేశ్‌బాబులతోపాటు కె.రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘న్యూటన్‌ ఆపిల్‌ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను’’ అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు (K. Raghavendrarao)అన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ (unstoppable 2) షోకి అల్లు అరవింద్‌(Allu aravind), సురేశ్‌బాబులతోపాటు కె.రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ ప్రశ్నలకు సరదా సమాధానాలిచ్చారు. 40 ఏళ్ల కెరీర్‌లో సురేష్‌ ప్రొడక్షన్స్‌, గీతా ఆర్ట్స్‌ ఎక్కువ సినిమాలు తీసిన ఆయన ‘40 ఏళ్లగా వీరిద్దరి మధ్య శాండ్‌విచ్‌లా నలిగిపోయా... ఈ షోలో కూడా  వీరి మధ్యే నలిగిపోవాలా? అని సరదాగా సంభాషించారు. ఇదే వేదికపై రాఘవేంద్రరావు బి.ఎకి నిర్వచనం ఇచ్చారు. ‘బి.ఏ’ అంటే బొడ్డు మీద ఆపిల్‌  అని అరవింద్‌ చెప్పారు. ఆ సంభాషణలకు షోలో ఆడియన్స్‌ పక్కున నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది. 


Updated Date - 2022-12-02T00:21:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!