సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allari Naresh : మరో హిట్‌కు ‘నాంది’

ABN, First Publish Date - 2022-06-27T21:21:44+05:30

అల్లరి నరేష్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు కమర్షియల్‌గానూ సక్సెస్‌ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. షైన్‌ స్ర్కీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లరి నరేష్‌(Allari naresh), దర్శకుడు విజయ్‌ కనకమేడల (Vijay kanakamedala)కాంబినేషన్‌లో వచ్చిన ‘నాంది’  (Naandi) చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు కమర్షియల్‌గానూ సక్సెస్‌ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. షైన్‌ స్ర్కీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. రక్తపు మరకలతో నిండిన చేతులకు సంకెళ్ళు, ఆ చేతుల నీడ గోడపై స్వేచ్ఛగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఇంటరెస్టింగ్‌గా ఉంది. తొలి చిత్రాన్ని విలక్షణ కథతో తెరకెక్కించిన విజయ్‌ కనకమేడల రెండవ సినిమా కోసం పవర్‌ఫుల్‌ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. ఇందులో నరేశ్‌ ఇంటెన్స్‌ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం నరేష్‌ చేస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘నాంది’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. (Allari naresh new movie announced)



Updated Date - 2022-06-27T21:21:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!