అల్లం అర్జున్‌కుమార్‌ పెళ్లి ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-03-17T09:32:03+05:30 IST

వైవిధ్యమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపుదిద్దుకొన్న ‘అశోకవనంలో అర్ణున కల్యాణం’ చిత్రాన్ని ఏప్రిల్‌ 22న విడుదల...

అల్లం అర్జున్‌కుమార్‌ పెళ్లి ఎప్పుడంటే..

వైవిధ్యమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపుదిద్దుకొన్న ‘అశోకవనంలో అర్ణున కల్యాణం’ చిత్రాన్ని ఏప్రిల్‌ 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు బాపినీడు, సుధీర్‌ ఈదర ప్రకటించారు. బి.విఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ సమర్పణలో తయారవుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. ఇందులో అల్లం అర్జున్‌కుమార్‌గా విశ్వక్‌ సేన్‌ నటిస్తున్నారు. తను ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదనీ, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘ఓ ఆడపిల్ల’, ‘సిన్నవాడా’ పాటలకు అద్భుత స్సందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. రుక్సర్‌ థిల్లాన్‌ ఈ చిత్ర కథానాయిక. 

Updated Date - 2022-03-17T09:32:03+05:30 IST

Read more