సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇదంతా తెలుగు ప్రేక్షకుల మహిమే!

ABN, First Publish Date - 2022-07-17T06:35:12+05:30

రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించారు. ఇటీవలే విడుదలైంది. ‘వారియర్‌’కి వస్తున్న స్పందన పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సె్‌సమీట్‌లో రామ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతికూల వాతావరణంలోనూ మా సినిమాని విడుదల చేశాం. వర్షాల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, రారా? అని చాలా భయపడ్డాం. ఓ దశలో విడుదల వాయిదా వేద్దామనుకొన్నాం. కానీ ధైర్యం చేసి రిలీజ్‌ చేశాం. మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. ఈ చిత్రానికి ఇన్ని వసూళ్లు వస్తున్నాయంటే అదంతా తెలుగు ప్రేక్షకుల మహిమే ‘వారియర్‌’తో సినిమాపై వాళ్ల ప్రేమని మరోసారి చాటుకొన్నార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘థియేటర్లో ఈ సినిమా చూశా. ప్రతీ సన్నివేశానికీ అపూర్వమైన ఆదరణ లభిస్తోంద’’న్నారు. ‘‘వర్షాల్లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు రావడం ఆనందంగా ఉంద’’న్నారు ఆది పినిశెట్టి. 


Updated Date - 2022-07-17T06:35:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!