సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Deverakonda: అందరి చూపు దేవరకొండ పైనే!

ABN, First Publish Date - 2022-08-24T22:30:20+05:30

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అనే పేరు ఈరోజు దేశం అంతా మారుమోగిపోతోంది. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) అనే ఒక్క సినిమాతో తానేంటో చూపించి.. ఈరోజు పాన్ ఇండియా (Pan India) సినిమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అనే పేరు ఈరోజు దేశం అంతా మారుమోగిపోతోంది. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) అనే ఒక్క సినిమాతో తానేంటో చూపించి.. ఈరోజు పాన్ ఇండియా (Pan India) సినిమా ‘లైగర్’ (Liger)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గురువారం ఈ సినిమా అన్ని భాషల్లోనూ చాలా భారీగా విడుదల కాబోతోంది. సినిమా బిజినెస్ కూడా 90 కోట్ల వరకు జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా విజయ్ దేవరకొండ వంటి నటుడుకి చాలా గొప్ప విషయం. 


ఎందుకంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో వచ్చిన విజయ్ చాలా తక్కువ కాలంలో ఇటువంటి పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. అందరి చూపు ముఖ్యంగా మన తెలుగు చలన చిత్ర సీమ (Tollywood) అంతా ఈ సినిమా ఫలితం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఇప్పుడున్న టాప్ యాక్టర్స్ అందరూ ఏదో విధంగా ఇండస్ట్రీ‌లో సపోర్ట్‌తో వచ్చిన వారే. అయినా వాళ్ళకి చాలా సంవత్సరాలు పట్టింది ఒక పాన్ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు రావటానికి. 


ఉదాహరణకి ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు..  వీరందరూ చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరుకోలేక పోయారు. ఇప్పుడు విజయ్ తక్కువ కాలంలో చాలా ఎత్తుకు ఎదగటం వల్ల, వీళ్ళందరూ బయటకి మామూలుగా వున్నా, లోలోపల ఈ సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, విజయ్ వీళ్ళందరికీ గట్టి పోటీ ఇస్తాడనటంలో ఎట్టి సందేహం లేదు.

Updated Date - 2022-08-24T22:30:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!