సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Comedian Ali: ఎవరికీ ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు: అలీ

ABN, First Publish Date - 2022-09-30T21:14:30+05:30

నటుడు అలీ (Comedian Ali) వైఎస్ఆర్ సిపి (YSRCP) నుండి వేరే పార్టీ కి మారుతున్నారన్న వార్తలను ఖండించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడు అలీ (Comedian Ali) వైఎస్ఆర్ సిపి (YSRCP) నుండి వేరే పార్టీ కి మారుతున్నారన్న వార్తలను ఖండించాడు. అలీ జనసేన (Jana Sena) పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు అన్న వార్త సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. దీనికి అలీ స్పందిస్తూ, తాను వైఎస్ఆర్ సిపి లోనే వున్నాను అని, పార్టీ మారలేదు అని చెప్పాడు. మీరు ఇప్పుడు హ్యాపీ గా వున్నారా అన్న ప్రశ్నకు, అంటే ఏ విధంగా అని అడిగాడు అలీ. తెలుగు దేశం (Telugu Desam) పార్టీ నుండి ఎన్నికల ముందు వైఎస్ఆర్ సిపి లోకి మారి, ప్రచారం కూడా చేసారు కదా, మరి ఇంతవరకు మీకు ఏ పదవి ఇవ్వలేదు, దానికి మీరు హ్యాపీ గా వున్నారా అని అడిగిన దానికి తనదయిన శైలిలో సమాధానం ఇచ్చాడు అలీ. "ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో వాళ్లకి తెలుసు," అని అన్నాడు అలీ. ఇందులో కొనసాగుతారా అన్న ప్రశ్నకు, అవును అనే సమాధానం ఇచ్చాడు. వార్తలు రాసే ముందు తనని అడిగి రాస్తే బాగుంటుందని, లేకపోతే చాల అపార్ధాలు వస్తాయని చెప్పాడు అలీ. 

తెలుగు దేశం పార్టీ లో వున్నప్పుడు రాజమండ్రి (Rajahmundry) నుండి పోటీ చెయ్యడానికి ఉద్యుక్తుడు అయ్యాడు, కానీ అప్పుడు పార్టీ అలీ కి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు అలీ వెంటనే తెలుగు దేశం కి రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్ సిపి లో చేరాడు. ఆ పార్టీ కి ప్రచారం కూడా బాగా చేసాడు, కానీ ఇంతవరకు అతనికి ఏ పదవి కూడా ఇవ్వలేదు. ఇకముందు తాను ఏమైనా నిర్ణయం తీసుకుంటే ముందుగా పత్రికల వాళ్ళకి చెప్పే చేస్తాను అని అన్నాడు అలీ.

Updated Date - 2022-09-30T21:14:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!