Prithviraj సినిమాకి ఆత్మలాంటి ‘హ‌రిహ‌ర్’ పాట విడుదల

ABN , First Publish Date - 2022-05-12T23:00:27+05:30 IST

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’ (Prithviraj). 2017 మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఈ

Prithviraj సినిమాకి ఆత్మలాంటి ‘హ‌రిహ‌ర్’ పాట విడుదల

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’ (Prithviraj). 2017 మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఈ చిత్రంతో నటిగా అరంగేట్రం చేస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. అత్యంత పరాక్రమ  ధైర్య సాహసాలు కలిగి, ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ (Muhammad of Ghor) నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్‪గా ఈ చిత్రంలో అక్షయ్ నటిస్తున్నారు. జూన్ 3న హిందీ, తమిళంతో పాటు  తెలుగులో ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానున్న ఈ చిత్రం నుండి తాజాగా ‘హరిహర్’ (HariHar) అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. తన నటజీవితంలో విన్న అత్యంత దేశభక్తి నిండి ఉన్న  పాటగా చెప్పుకొచ్చారు.


పాట విడుదల సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘హరిహర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహ్మద్ ఘోరీతో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృథ్వీరాజ్ చౌహాన్‪కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృథ్వీరాజ్ బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది. ఈ పాట పృథ్వీరాజ్ తత్వాన్ని , దృఢ సంకల్పాన్ని  తెలియజేస్తుంది. మొదటసారి  విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను. నా నటజీవితంలో విన్న అత్యంత దేశభక్తి నిండి ఉన్న  పాట ఇదే..’’ అని తెలిపారు.


కాగా, అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ ‘చాణిక్య’ (Chanakya)ని  తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది (Dr. Chandraprakash Dwivedi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత (Sanyogita) పాత్రలో మానుషి చిల్లర్  నటించారు. ప్రస్తుతం విడుదలైన ‘హరిహర్’ పాట యూట్యూబ్‪లో టాప్‪లో ట్రెండ్ అవుతోంది. 



Updated Date - 2022-05-12T23:00:27+05:30 IST