సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akkineni Nagarjuna: బిగ్‌బాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..!

ABN, First Publish Date - 2022-09-19T02:39:15+05:30

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఒకరు. మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో ‘కౌన్ బనేగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఒకరు. వైవిధ్య భరిత సినిమాలతో మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. తాజాగా ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-6’ (Bigg Boss Telugu Season 6)‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ రియాలిటీ షోలో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపాడు. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు చెప్పాడు.     


బిగ్‌బాస్ మొదటి సీజన్ తనకు చాలా కఠినంగా అనిపించిందని తెలిపాడు. ‘‘వేరే వాళ్ల జీవితాల్లోకి చొచ్చుకెళ్లి జడ్జిగా తీర్పును ఇస్తున్నట్టు ఉంది. కానీ, ఫన్ గా హోస్ట్ చేయడం నేర్చుకున్నాను. సల్మాన్ ఖాన్ (Salman Khan) మాదిరిగా హోస్ట్ చేయడానికి ప్రయత్నించాను. అతడు అద్భుతంగా, ఎంటర్ టైనింగ్‌గా హోస్ట్ చేస్తుంటాడు. నాకు ఎంటర్ టైన్‌మెంట్ గురించి తెలుసు. బిగ్‌బాస్ హౌస్‌లో అద్భుతమైన కామెడీ పండుతుంది. కంటెస్టెంట్స్‌కు కామెడీ గేమ్స్‌నే ఇస్తాం. ఆ సమయంలోనే నేను వారితో మాట్లాడుతుంటాను. ఎప్పుడు భోదనలు చేయలేదు. సల్లూ భాయ్‌తో బిగ్‌బాస్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను షోకు హోస్ట్‌గా వ్యవహరించడం ప్రారంభమయ్యాక ఎప్పుడు అతడిని కలుసుకోలేదు. సల్మాన్ కొన్నేళ్లుగా బిగ్‌బాస్‌ను హోస్ట్ చేస్తున్నాడు. కానీ, నేను మాత్రం మూడేళ్ల క్రితమే హోస్ట్ చేయడం ప్రారంభించాను. నేను దేశంలోని అన్ని వెర్షన్స్ బిగ్‌బాస్ చూస్తుంటాను. హిందీ వెర్షన్ ఈ మధ్యనే చూశాను. కమల్ హాసన్ (Kamal Haasan), మోహన్ లాల్ (Mohanlal) లవి కూడా చూశావి. అన్ని వెర్షన్స్ నుంచి పాయింట్స్ తీసుకుంటుటాను. ఎలా హోస్ట్ చేస్తున్నారో అని చూస్తుంటాను’’ అని అక్కినేని నాగార్జున తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. నాగార్జున ఈ మధ్య ‘బ్రహ్మాస్త్ర పార్ట్: శివ’ (Brahmastra Part One: Shiva) లో నటించాడు. ఈ చిత్రంలో నంది అస్త్రంగా కనిపించాడు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ‘ది ఘోస్ట్’ (The Ghost) లోను నటించాడు. ఈ సినిమా దసరా కానుకగా థియేటర్స్‌లోకి రానుంది. 

Updated Date - 2022-09-19T02:39:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!