'ఏజెంట్': వైరల్‌గా అఖిల్ బర్త్ డే పోస్టర్..

ABN , First Publish Date - 2022-04-08T16:34:24+05:30 IST

ఈ రోజు (ఏప్రిల్ 8) అక్కినేని హీరో అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ నుంచి చిత్రబృందం కొత్త పోస్టర్‌ను వదిలింది. 'అఖిల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని యంగ్ హీరో ఎట్టకేలకు మూడు

'ఏజెంట్': వైరల్‌గా అఖిల్ బర్త్ డే పోస్టర్..

ఈ రోజు (ఏప్రిల్ 8) అక్కినేని హీరో అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ నుంచి చిత్రబృందం కొత్త పోస్టర్‌ను వదిలింది. 'అఖిల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని యంగ్ హీరో ఎట్టకేలకు మూడు సినిమాల తర్వాత గత చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తో మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా 'ఏజెంట్' లో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. 


ఇదులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ - సురేందర్ రెడ్డి 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. సిక్స్ ప్యాక్ బాడితో అఖిల్ స్టన్నింగ్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా..హిప్ హాప్ తమీజ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్ చిత్రం ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది.  Updated Date - 2022-04-08T16:34:24+05:30 IST

Read more