Samantha: సామ్ అనారోగ్యంపై కామెంట్ చేసిన అఖిల్

ABN , First Publish Date - 2022-10-30T20:35:55+05:30 IST

సమంత (Samantha) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది. ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది.

Samantha: సామ్ అనారోగ్యంపై కామెంట్ చేసిన అఖిల్

సమంత (Samantha) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది. ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సామ్ అనారోగ్యం‌పై తాజాగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కూడా కామెంట్ చేశాడు. ‘‘డియర్ సామ్.. అందరి ప్రేమాభిమానాలతో నీకు మరింత ధైర్యం చేకూరాలి’’ అని అఖిల్ తెలిపాడు. అఖిల్ పోస్ట్‌తో నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేశారు. లైకుల రూపంలో తమ అనందాన్ని తెలిపారు. అంతకు ముందు చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్‌టీఆర్, కాజల్ అగర్వాల్, నందిని రెడ్డి, శ్రియ శరణ్, రాశీ ఖన్నా, దుల్కర్ సల్మాన్, సందీప్ కిషన్, అడివి శేష్  తదితరులంతా సామ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెట్టారు.   


సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొంది. ‘యశోద’ కు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘంగా పోస్ట్ పెట్టింది. ఈ పిక్‌లో సామ్ చేతికి సెలైన్ ఉండటం గమనార్హం. ‘‘.. ‘యశోద’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసైటిస్’ (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కానీ, నేను కోలుకోవడానికి ఆలస్యమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటాను. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘యశోద’ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న విడుదల కానుంది.



Updated Date - 2022-10-30T20:35:55+05:30 IST