సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో ఘనంగా ‘అఖండ’ 50వ రోజు వేడుక

ABN, First Publish Date - 2022-01-20T22:59:50+05:30

‘అఖండ’ సినిమా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తయిన సందర్బంగా ప్రపంచ దేశాలలో స్పెషల్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలలో ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్లా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అఖండ’ సినిమా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తయిన సందర్బంగా ప్రపంచ దేశాలలో స్పెషల్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలలో ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్లా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో బాలయ్య అభిమానులు 50వ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 


ఈ సందర్బంగా బ్రిస్బేన్‌ బాలయ్య అభిమానులు మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలో విడుదలైన ‘అఖండ’ చిత్రం..  తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసింది. ఇండస్ట్రీకి దారి చూపెట్టడమే కాకుండా.. ధైర్యాన్నిచ్చింది. 50 రోజుల పాటు థియేటర్లలో సినిమాలు ఆడటం కనుమరుగవుతున్న తరుణంలో.. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటం టాలీవుడ్‌కి మంచి శుభపరిణామం. ఇంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము..’’ అని తెలిపారు.







Updated Date - 2022-01-20T22:59:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!