సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దుమ్మురేపుతోన్న Liger ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ

ABN, First Publish Date - 2022-07-12T00:17:21+05:30

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్‌బ్రీడ్). ఈ చిత్ర ఫస్ట్ సింగల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్‌బ్రీడ్). ఈ చిత్ర ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సోషల్ మీడియా, యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌‌లో నిలిచి.. సంచలనాలను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ‘అక్డీ పక్డీ’ (Akdi Pakdi) పూర్తి పాటను మేకర్స్ విడుదల చేశారు. మెస్మరైజింగ్ మాస్ బీట్స్‌తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్‌గా ఈ పాట ప్రస్తుతం దుమ్మురేపుతోంది. పాటలో వినిపించిన సాహిత్యం క్యాచీ‌గా ఉంటూ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌‌ని ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటూ.. అదిరిపోయే బీట్‌తో డ్యాన్సింగ్ నెంబర్‌గా ఈ పాట జోష్ క్రియేట్ చేస్తోంది.


లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్‌ అనేలా ఉన్నాయి. డ్యాన్స్ మూమెంట్స్‌లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. విజయ్‌‌కి జోడీగా బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో వున్నాయి. ఈ పాటని తెలుగులో అనురాగ్ కులకర్ణి,  రమ్య బెహరా ఆలపించగా.. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. తమిళ వెర్షన్‌‌కు సాగర్ సాహిత్యం అందించగా.. వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలిసి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్‌ని ఆలపించగా.. సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌‌ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌‌లు ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



Updated Date - 2022-07-12T00:17:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!