నూనూగు మీసాల పోరడు చూడు...

ABN , First Publish Date - 2022-06-04T05:51:58+05:30 IST

ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. గెహన సిప్పీ కథానాయిక. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

నూనూగు మీసాల పోరడు చూడు...

ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. గెహన సిప్పీ కథానాయిక. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. వి.ఎస్‌.రాజు నిర్మాత. ఈ చిత్రంలోని ‘నూనూగు మీసాల పోరడు చూడు’ అనే గీతాన్ని ప్రముఖ కథానాయిక సమంత విడుదల చేశారు. సురేష్‌ బొబ్బిలి స్వర పరిచిన గీతమిది. కాసర్ల శ్యామ్‌ రాశారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను నృత్య రీతులు సమకూర్చారు. ‘‘కథానాయికపై తెరకెక్కించిన సోలో గీతమిది. చాలా బాగా వచ్చింది. హుషారుగా సాగిపోతుంది. ఈ చిత్రంలో పాటలన్నీ బాగా వచ్చాయి. ప్రతీ పాటా సందర్భోచితంగా సాగుతుంది. యాక్షన్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. ఆకాష్‌కి కొత్త తరహా ఇమేజ్‌ అందిస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు. 

Updated Date - 2022-06-04T05:51:58+05:30 IST

Read more