అజయ్ మామా..
ABN , First Publish Date - 2022-12-25T01:44:11+05:30 IST
అజయ్ కతుర్వార్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘అజయ్ గాడు’....

అజయ్ కతుర్వార్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘అజయ్ గాడు’. భాను శ్రీ, శ్వేతా మోహతా కథానాయికలు. ఈ చిత్రం నుంచి ‘కైకు మామా’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. శ్రీకాంత్, అజయ్, ఇన్సాన్ రాసిన పాట ఇది. సుమంత్ బట్టు స్వరపరిచారు. ఇన్సాన్ పాడారు. విశాల్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యువతను ఆకట్టుకొనే పాట ఇది. థియేటర్లో డాన్సులు చేయిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కీ, పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు అజయ్.