సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Agni Nakshatram: ఆకట్టుకుంటున్న మోహన్ బాబు ఫస్ట్ లుక్..

ABN, First Publish Date - 2022-07-31T20:38:20+05:30

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు (Manchui Mohan Babu), మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నిర్మిస్తున్న తాజా చిత్రం 'అగ్ని నక్షత్రం'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu), మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం 'అగ్ని నక్షత్రం' (Agni Nakshatram). ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ఆయన ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నారు. 


ఇక ఈ పాత్ర విషయానికొస్తే...తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల... డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్. గంభీరమైన లుక్ తో మోహన్ బాబు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని తాజా లుక్ ని చూస్తే అర్ధమవుతోంది. 


మొదటిసారి మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర చేస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. చైత్ర శుక్ల ద్వితీయ, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా, లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Updated Date - 2022-07-31T20:38:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!