మనాలీలో ఏజెంట్‌ హంగామా

ABN , First Publish Date - 2022-05-17T05:51:15+05:30 IST

అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. సాక్షి విద్యా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది...

మనాలీలో ఏజెంట్‌ హంగామా

అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’.  సాక్షి విద్యా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రధారి. కొంత విరామం తరవాత.. సోమవారం నుంచి మనాలీలో షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం అఖిల్‌, కొంతమంది ఫైటర్ల మఽధ్య ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ వారమంతా మనాలీలోనే చిత్రీకరణ సాగుతుందని తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ముందే ప్రకటించారు. అయితే... రిలీజ్‌ డేట్‌ మారే అవకాశాలున్నాయని సమాచారం. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్‌ గెటప్‌, తన పాత్ర చిత్రణ, మమ్ముటి - అఖిల్‌ మధ్య సన్నివేశాలు, యాక్షన్‌ దృశ్యాలు ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. 


Updated Date - 2022-05-17T05:51:15+05:30 IST

Read more