Captain: ‘విక్రమ్’ తర్వాత ‘కెప్టెన్’కి కనెక్టయిన శ్రేష్ఠ్ మూవీస్

ABN , First Publish Date - 2022-08-23T00:54:23+05:30 IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్‌తో పాటు

Captain: ‘విక్రమ్’ తర్వాత ‘కెప్టెన్’కి కనెక్టయిన శ్రేష్ఠ్ మూవీస్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో.. స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్‌లో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. శ్రేష్ఠ్ మూవీస్ (Shresht Movies) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ రెడ్డి (హీరో నితిన్ తండ్రి) తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాలలో ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు శ్రేష్ఠ్ మూవీస్ మరో చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమా పేరే ‘కెప్టెన్’ (Captain).


కోలీవుడ్ స్టార్ ఆర్య (Arya) కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ (Shakti Soundar Rajan) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తుండటంతో.. సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ ‘టెడ్డీ’ సినిమా చేశారు. 


‘కెప్టెన్’ చిత్ర ట్రైలర్‌ని హీరో నితిన్ (Nithiin) తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే వినూత్న కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లుగా అర్థమవుతోంది. ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు ఆర్య. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రలో ఆయన నటించారు. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి హీరో అండ్ టీమ్ వెళ్ళినప్పుడు ఏమైందనేది కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) కనిపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-08-23T00:54:23+05:30 IST