Puri Jagannadh: లైగర్ పరాజయంపై పూరీ జగన్నాథ్ లేఖ
ABN , First Publish Date - 2022-10-30T21:29:20+05:30 IST
దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన సినిమా ‘లైగర్’ (Liger). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో కొంత మంది బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అతడి ఇంటి ముందు ధర్నా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన సినిమా ‘లైగర్’ (Liger). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో కొంత మంది బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అతడి ఇంటి ముందు ధర్నా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. దీంతో కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ తనను వేధిస్తున్నారని ఇటీవల పూరీ జగన్నాథ్ పోలీసుల రక్షణను కోరాడు. ఇండస్ట్రీలో తన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో పూరీ ఓ లేఖను మీడియాకు విడుదల చేశాడు.
‘‘సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి జీవితంలో సర్వ సాధారణం. సక్సెస్ అయితే డబ్బు వస్తుందని, ఫెయిల్ అయితే బోలెడు జ్ఞానం వస్తుంది. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే. నేను ఎవరిని మోసం చేయలేదు. మళ్లీ ఇంకో సినిమా చేస్తా. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తా’’ అని పూరీ జగన్నాథ్ లేఖలో పేర్కొన్నాడు.
