సాహసనారి ఇంద్రాణి

ABN , First Publish Date - 2022-03-28T06:22:11+05:30 IST

స్టీఫెన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఇంద్రాణి’. మానియా భరద్వాజ్‌, కబీర్‌ సింగ్‌, ప్రణీత కీలక పాత్రధారులు...

సాహసనారి ఇంద్రాణి

స్టీఫెన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఇంద్రాణి’. మానియా భరద్వాజ్‌, కబీర్‌ సింగ్‌, ప్రణీత కీలక పాత్రధారులు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నరేష్‌ విజయకృష్ణ క్లాప్‌నిచ్చారు. బెక్కం వేణుగోపాల్‌ స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సూపర్‌ గాళ్‌ కథ ఇది. ఇప్పటి వరకూ మనకు సూపర్‌ హీరోలే ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తరవాత అంతా ‘ఇంద్రాణి’ గురించే మాట్లాడుకుంటారు. ఇది పక్కా మాస్‌ సినిమా. కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇంద్రాణి పాత్రలో చాలా రకాలైన పార్వ్శాలు ఉంటాయి. ఆ పాత్రకు మానియానే సరిపోతుందనిపించింద’’న్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సుమన్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు రెండున్నరేళ్లు కష్టపడి ఈ స్ర్కిప్టు తయారు చేశారు దర్శకుడు. సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాయి కార్తీక్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంద’’న్నారు. 


Updated Date - 2022-03-28T06:22:11+05:30 IST