సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ది లెజెండ్‌’ సాహసాలు

ABN, First Publish Date - 2022-07-25T06:04:19+05:30

లెజెండ్‌ శరవణన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది లెజెండ్‌’. జెడి - చెర్రి దర్శకత్వం వహించారు. ఊర్వశి రౌటేలా కథానాయిక. లక్ష్మీరాయ్‌ ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెజెండ్‌ శరవణన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది లెజెండ్‌’. జెడి - చెర్రి దర్శకత్వం వహించారు. ఊర్వశి రౌటేలా కథానాయిక. లక్ష్మీరాయ్‌ ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు. ఈనెల 28న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. శరవణన్‌ మాట్లాడుతూ ‘‘ఓ సామాన్యుడు లెజెండ్‌గా ఎలా మారాడు? తన దేశానికి ఎలాంటి సేవ చేశాడు? ఆ క్రమంలో తనకి ఎదురైన పరిణామాలేంటి? అనేదే ఈ చిత్రకథ. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాం. పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశార’’న్నారు. జెడి మాట్లాడుతూ ‘‘లెజెండ్‌ పాన్‌ ఇండియా సినిమా. భారీ హంగులన్నీ ఉన్నాయి. శరవణన్‌ ఓ విజయవంతమైన వ్యాపారవేత్త. ఇప్పుడు నటుడిగానూ తనకంటూ ఓ స్థానం సంపాదించుకొంటారు. ఆయన అంకితభావం చూస్తే ఆశ్చర్యమేసింద’’న్నారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని మరో దర్శకుడు చెర్రి తెలిపారు. 

Updated Date - 2022-07-25T06:04:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!