సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అదృష్టం వరించిందా సఖీ?!

ABN, First Publish Date - 2022-01-25T06:01:21+05:30

కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. నగేష్‌ కుకునూర్‌ దర్శకుడు. వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ పతాకంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. నగేష్‌ కుకునూర్‌ దర్శకుడు. వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. ఈనెల 28న విడుదల అవుతోంది. సోమవారం ట్రైలర్‌ ఆవిష్కరించారు. చిత్తూరు మాండలికంలో.. ఓ పల్లెటూరి పిల్లలా కీర్తి కనిపించింది. కోచ్‌గా జగపతిబాబు, కథానాయికని ప్రోత్సహించే కీలకమైన పాత్రలో ఆది పినిశెట్టి తెరపై సందడి చేశారు. ఇది క్రీడా నేపథ్యంలో సాగే కథ. ఓ దురదృష్టవంతురాలైన పల్లెటూరి అమ్మాయి, షూటింగ్‌లో విజేతగా ఎలా నిలిచింది? అనేదే కథ. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జాతీయ ఉత్తమనటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి కెరీర్‌లో మరో గొప్ప పాత్ర ఇది. అందులో కీర్తి నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని కీర్తి పండించింది. జగపతిబాబు, ఆదిల పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ చక్కటి సంగీతం అందించార’’న్నారు. 


Updated Date - 2022-01-25T06:01:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!