మే 18న అడివి శేష్ Major నుండి మరో అప్‪డేట్

ABN , First Publish Date - 2022-05-17T01:41:12+05:30 IST

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ (Adivi Sesh) ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం

మే 18న అడివి శేష్ Major నుండి మరో అప్‪డేట్

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ (Adivi Sesh) ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఇందులో  మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడి (Mumbai attack)లో వీరమరణం.. ఇలా అతని జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు మరో అప్డేట్ ని వదిలేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.


ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘హృదయం’ (Hrudayam) సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రేమ కథని అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఇప్పుడు సెకండ్ సింగల్ ‘ఓహ్ ఇషా’ (Oh Isha) వీడియో సాంగ్‪ను మే 18న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో శేష్, సైయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జోడి బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా ఉన్నారు. 1995లో యంగ్ సందీప్ లవ్ లైఫ్‪ని ఈ పోస్టర్‪లో ఆవిష్కరించారు. అలాగే పోస్టర్ డిజైన్ కూడా 1995 పాత ఆడియో క్యాసెట్ అంచులని గుర్తు చేస్తూ వింటేజ్ లుక్‪లో డిజైన్ చేశారు. ఈ పిక్ చూస్తుంటే.. ఈ పాట మరో రొమాంటిక్ మెలోడీగా ఉండబోతోందనేది తెలుస్తోంది.


శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు (Mahesh Babu) జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainment), ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ (A+S Movies)తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా (Sony Pictures Films India) భారీగా నిర్మించింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala), ప్రకాష్ రాజ్ (Prakash Raj), రేవతి (Revathi), మురళీ శర్మ (Murali Sharma) కీలక పాత్రలలో  కనిపించబోతున్నారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్, 900K పైగా లైక్‌లను పొందింది. 

Updated Date - 2022-05-17T01:41:12+05:30 IST

Read more