Major: ‘ఓహ్ ఇషా’ వీడియో సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్
ABN , First Publish Date - 2022-05-19T01:57:54+05:30 IST
వెర్సటైల్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా..
వెర్సటైల్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగల్ ‘ఓహ్ ఇషా’ (Oh Isha) వీడియో సాంగ్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ.. విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
‘‘హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నది
చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేవో ఆడుతున్నది’’.. అంటూ సాగిన ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ (Rajiv Bharadwaj) సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ (Armaan Malik), చిన్మయి శ్రీపాద ( Chinmayi Sripada) ఆలపించారు. లవ్లీ మెలోడీగా వచ్చిన ఈ పాట ఇన్సెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) స్వరాలను సమకూర్చారు. ఒక గెట్ టుగెదర్‌లో ఆర్మీ అధికారుల తమ లైఫ్ పార్ట్‌నర్స్‌తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్‌గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైంది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వంఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90లలో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్‌ని ఈ పాటలో అందంగా చూపించారు. సందీప్ కాలేజీ డేస్లోని జ్ఞాపకాలని, లవ్లీ మూమెంట్స్‌ని ప్లజంట్‌గా చిత్రీకరించారు. ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జోడి చాలా క్యూట్‌గా అలరించింది. శేష్ అచ్చూ కాలేజీ స్టూడెంట్‌లానే మేకోవర్ అవ్వడం చాలా నేచురల్‌గా వుంది. ఈ పాటలో సాయి మంజ్రేకర్ తన ఫోన్ నెంబర్ని ఒక్కొక్కటిగా ఇవ్వడం, ఇద్దరూ కెరీర్‌ని డిసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీ.. ఇలా అందంగా లవ్లీ మాంటేజస్లో చూపించడం ఆకట్టుకుంటోంది.
26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో.. మహేష్ బాబు (Mahesh Babu) జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.