Enthavaarugaani: థ్రిల్లింగ్‌గా.. హిట్ హీరో వదిలిన టీజర్

ABN , First Publish Date - 2022-12-08T03:19:59+05:30 IST

సూర్య శ్రీనివాస్ (Surya Srinivas), షెర్రీ అగర్వాల్ (Sherry Agarwal) ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

Enthavaarugaani: థ్రిల్లింగ్‌గా.. హిట్ హీరో వదిలిన టీజర్

సూర్య శ్రీనివాస్ (Surya Srinivas), షెర్రీ అగర్వాల్ (Sherry Agarwal) ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..  రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎంతవారు గాని’. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ని.. ‘హిట్ 2’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో అడవి శేష్ విడుదల చేసి చిత్ర‌యూనిట్‌కి అభినందనలు తెలుపుతూ.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ప్రస్తుతం ఈ టీజర్ 1 మిలియన్ పైగా వ్యూస్ సాధించి.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


టీజర్ విషయానికి వస్తే.. ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, సస్పెన్స్‌తో పాటు రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఇందులో ఉన్నట్లుగా టీజర్ చెప్పేస్తుంది. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. దర్శకుడు శ్రీనివాస్. ఎన్ (Sriniwaas N) విషయానికి వస్తే.. ‘నివాస్’ అనే పేరుతో 'రంగీలా' సినిమాతో ఎడిటర్‌గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత వర్మ సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేసి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ‘ఎంతవారుగాని’ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు. కాగా, ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం, ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. (Enthavaarugaani Teaser)





Updated Date - 2022-12-08T03:19:59+05:30 IST