గూఢచారి వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-12-31T02:11:24+05:30 IST

హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అడివి శేష్‌. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి.

గూఢచారి వస్తున్నాడు

హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అడివి శేష్‌. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి. గతంలోనే ఈ చిత్రం సీక్వెల్‌ను ప్రకటించారు అడివిశేష్‌. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ‘జీ2’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌సూట్‌లో చేతిలో మెషీన్‌గన్‌తో దాడికి సిద్ధంగా ఉన్న అడివి శేష్‌ లుక్‌తో కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజన్‌ వీడియోను జనవరి 9న ముంబై, ఢిల్లీలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అడివిశేష్‌ కథను అందిస్తున్నారు. ‘మేజర్‌’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్‌ సిరిగినీడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-12-31T02:11:24+05:30 IST

Read more