సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adivi Sesh: 'హిట్ 2' అంతకుమించి..

ABN, First Publish Date - 2022-06-04T16:41:57+05:30

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథా చిత్రాలతో నటిస్తూ హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్ (Adivi Sesh).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథా చిత్రాలతో నటిస్తూ హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్ (Adivi Sesh). ఆయన హీరోగా నటించిన మేజర్ (Major) చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. 26/11 ఉగ్రవాది దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) పాత్రలో అడవి శేష్ నటించి సినీ ప్రముఖుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. 


అయితే, ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను శేష్ చెప్పుకొచ్చారు. నాని నిర్మాణంలో శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ 2 (hit 2) సినిమా రూపొందుతోంది. ఇందులో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. హిట్ 1 మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు తెరకెక్కుతున్న హిట్ 2 పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. హిట్ 1 లో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇప్పుడు సీక్వెల్ సినిమాలో అడవి శేష్ నటిస్తుండగా..ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది.


కానీ, కరోనా వల్ల కొంత ఆలస్యం అయితే, మేజర్ సినిమా వల్ల కొన్నాళ్ళు హిట్ 2ను పక్కన పెట్టారు. మేజర్ రిలీజైన నేపథ్యంలో హిట్ 2 సెట్స్‌పైకి రాబోతోంది. ఈ క్రమంలో శేష్ మాట్లాడుతూ.. 'మొదటి హిట్ మూవీతో పోల్చితే రెండవ హిట్ అంతకు మించి ఉంటుంది'.. అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, 'హిట్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నాను'.. అని అన్నారు. కాగా, ఈ సినిమాలో మీనాక్షి చైదరీ హీరోయిన్‌గా నటిస్తోంది.  

Updated Date - 2022-06-04T16:41:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!