బ్రేక్‌ లేకుండా ఆది కెరీర్‌ సాగాలి

ABN , First Publish Date - 2022-12-29T01:29:26+05:30 IST

‘మా నాన్నతో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకూ వచ్చింది. వాడు క్రికెటర్‌ అవ్వాలని అనుకున్నాం. కానీ మెగాస్టార్‌ చిరంజీవి అన్నయ్య సాంగ్‌తో...

బ్రేక్‌ లేకుండా ఆది కెరీర్‌ సాగాలి

‘మా నాన్నతో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకూ వచ్చింది. వాడు క్రికెటర్‌ అవ్వాలని అనుకున్నాం. కానీ మెగాస్టార్‌ చిరంజీవి అన్నయ్య సాంగ్‌తో పరిశ్రమకు వచ్చాడు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘టాప్‌గేర్‌’ కూడా విజయం సాధించాలి’ అన్నారు సాయికుమార్‌. తన తనయుడు ఆది సాయికుమార్‌ నటించిన ‘టాప్‌గేర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో సందీప్‌ కిషన్‌తో కలసి బిగ్‌ టికెట్‌ను విడుదల చేశారు సాయికుమార్‌. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు శశి నాకు ఏడేళ్ల నుంచి స్నేహితుడు. అలాగే ఆది కూడా నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ‘టాప్‌గేర్‌’ సినిమాతో అతని కెరీర్‌ బ్రేక్‌ లేకుండా సాగిపోవాలి. వచ్చే ఏడాది అతనితో ఓ సినిమా తీయబోతున్నాను’ అని ప్రకటించారు. చిత్ర నిర్మాత శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘దర్శకుడు శశి చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. తమ సొంత సినిమా అనుకొని ప్రతి ఒక్కరూ పనిచేశారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ సంగీతం సినిమాకు హైలైట్‌ అవుతుంది. ఆది ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు. ‘థ్రిల్లర్‌, సస్పెన్స్‌.. ఇలా అన్నీ ఎమోషన్స్‌ ఉన్న మంచి కథ ఇది. సినిమా అంటే ఫ్యాషన్‌ ఉన్న నిర్మాత శ్రీధర్‌రెడ్డిగారు ఈ చిత్రానికి నన్ను దర్శకుడిగా ఎన్నుకోవడం నా అదృష్టం’ అన్నారు దర్శకుడు శశి.

Updated Date - 2022-12-29T01:29:26+05:30 IST

Read more